News September 19, 2024
NZB: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్
నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిఖత్ బుధవారం డీజీపీ జితేందర్‌ను కలిసి తన జాయినింగ్ ఆర్డర్ అందజేశారు.
Similar News
News November 10, 2024
కేటీఆర్‌ను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు: షబ్బీర్ అలీ
కేటీఆర్ ఓ బచ్చా అని, ఆయన్ను ఫార్ములా రేస్ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంటే ప్రజల నుంచి ఆదరణ వస్తోందని, దాన్ని చూసి ఓర్వలేకనే కేటీఆర్ అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ను మాత్రమే గుర్తిస్తుందన్నారు.
News November 10, 2024
పిట్లం: భానుడు.. చెరువులో విద్యుత్ వెలుగులా..!
సాయంత్రం వేళ సూర్యాస్తమయ సమయాన సూర్యుడి ప్రతిబింబం చెరువు నీటిలో విద్యుత్ బల్బు మాదిరి సాక్షాత్కరించింది. ఆకాశమంతా ఎర్రని కాంతులను వెదజల్లుతూ.. మరో వైపు నీటిలో దీప కాంతిని ప్రసరిస్తూ కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. పిట్లంలోని గ్రామ చెరువు వద్ద శనివారం ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించారు.
News November 10, 2024
ధాన్యం అమ్మాలంటే కష్ట పడాల్సిందే..!
భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.