News April 23, 2025
NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్‌పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ కథనం ప్రకారం.. కమలాపూర్‌కు చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్‌తో పడపడుతోంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.
Similar News
News April 23, 2025
HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.
News April 23, 2025
అద్భుతమైన క్యాచ్‌లు కాదు.. క్యాచ్ పడితే అద్భుతం!

IPL: ఫీల్డింగ్‌లో ఈ ఏడాది అన్ని జట్ల ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 40 మ్యాచులు జరగ్గా, అన్ని జట్లు కలిపి 111 క్యాచ్‌లు వదిలేశాయి. 247 మిస్‌ఫీల్డ్స్, 172 రనౌట్స్ మిస్ చేశాయి. 2020 నుంచి తొలి 40 మ్యాచ్‌లతో పోలిస్తే ఇదే చెత్త ప్రదర్శన. MI జట్టు ఒక్కటే 83.6% క్యాచింగ్ పర్సంటేజ్‌తో కాస్త మెరుగ్గా ఉంది. గతంలో అద్భుతమైన క్యాచ్‌లు చూసిన ఫ్యాన్స్ ప్రస్తుతం పట్టిన ప్రతి క్యాచ్‌నూ అద్భుతం అంటున్నారు.
News April 23, 2025
HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88 మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.