News April 9, 2024
NZB: దొంగ అనుకొని చెట్టుకు కట్టేశారు..!
మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగగా భావించి పోలీసులకు అప్పగించిన ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో చోటు చేసుకుంది. నిజామాబాద్ గాజుల్ పేటకు చెందిన గుండమల్ల గంగాధర్ ఎలుకుర్తి హవేలిలో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు వచ్చి అతన్నిపోలీస్ స్టేషన్ తరలించారు. గంగాధర్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
Similar News
News December 29, 2024
రెంజల్: ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము
రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము దర్శనం ఇచ్చింది. కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి బాత్‌రూమ్‌కి వెళ్లగా అక్కడ పాము కనిపించడంతో ఉద్యోగులకు తెలిపారు. మిగతా ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టె వారికి సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
News December 29, 2024
నిజామాబాద్: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా జి.సాయన్న
నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా జి. సాయన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు జిల్లా సీఈఓగా ఉన్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో నందిపేట్ ఎండీఓకు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డీఆర్డీఓ గా విధులు నిర్వహిస్తున్న సాయన్న బదిలీ పై నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు వచ్చారు.
News December 29, 2024
బోధన్: కోదండరామ్‌ను కలిసిన కార్మికులు
బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. వేతనాలు లేక కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.