News January 26, 2025

NZB: నాలుగు పథకాల ప్రారంభించే గ్రామాలు ఇవే

image

NZB జిల్లాలోని 31 గ్రామాల్లో ఆదివారం నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి. పలు గ్రామాలను అధికారులు ప్రకటించారు. మిర్దపల్లి, కోమన్ పల్లి, జలాల్పూర్, లింగాపూర్, లంగ్డపూర్, గన్పూర్, సీతయ్ పేట్, కమలాపూర్, గంగసముందర్, అన్సన్ పల్లి, నారాయణపేట, ముల్లంగి బి, కొడిచెర్ల, తిమ్మాపూర్, నర్సింపల్లి మల్కాపూర్, డొంకల్, వేంపల్లి, చిన్న వాల్ గోట్, జైతాపూర్ తో పాటు మిగతా గ్రామాల్లో పథకాలను అధికారులు ప్రారంభించనున్నారు.

Similar News

News January 31, 2025

NZB: ఇవాళ తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

image

సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 11 గంటలకు నీళ్లు-నిజాలు” పేరిట జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అలాగే మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు సమావేశానికి హాజరుకానున్నారు.

News January 30, 2025

టీయూ విద్యార్థులకు ALERT

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్ సెంకడీయర్ మూడో సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్ష ఫీజ్ తేదీలను యూనివర్సిటీ వెల్లడించింది. ఫిబ్రవరి 8 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. రూ.100 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 10 వరకు చెల్లించే అవకాశం ఉందని పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలు తెలిపారు. పూర్తి వివరాలను తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌ లో పొందుపరిచినట్లు వెల్లడించారు.

News January 30, 2025

స్వాతంత్ర్య త్యాగధనులను స్మరించుకున్న జిల్లా యంత్రాంగం

image

స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయంలో గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాననే సంకల్పం చాటాలని కలెక్టర్ అన్నారు.