News July 20, 2024

NZB: ‘నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే రోడ్డు ప్రమాదాలకు కారణం’

image

నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని NZB జిల్లా జడ్జి సునీత కుంచాల, సీపీ కల్మేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ సౌజన్యంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మైనర్ డ్రైవింగ్- డ్రంక్ అండ్ డ్రైవింగ్’ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

Similar News

News October 7, 2024

నసురుల్లాబాద్: గుండెపోటుతో యువతి మృతి

image

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన డేగావత్ బీనా (19) గుండెపోటుతో మృతి చెందింది. ఉన్నట్టుండి డెగావత్ బీనాకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. యువతి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గతంలో మృతురాలు బీనా తాత కూడా గుండెపోటుతో మరణించాడు.

News October 7, 2024

కామారెడ్డి: మూడు ఉద్యోగాలు వద్దని లేఖ

image

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అరుణ మూడు ఉద్యోగాలను వదులుకున్నారు. 2018లో TGT, PGT ఉద్యోగాలు రాగా, 2019లో JLగా ఎంపికై విధుల్లో చేరారు. అనంతరం DL ఉద్యోగం రావడంతో JL ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా DSCలో ర్యాంకు సాధించారు. అరుణ తాను సాధించిన 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలకు నాట్ విల్లింగ్ లేఖను డీఈఓకు అందజేసింది. లెటర్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు ఇతరులకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.

News October 7, 2024

మోస్రా: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సాయిలు(46) అప్పులు తీసుకున్నాడు. కాగా, అవి ఎలా తీర్చాలో అర్థం అవ్వక మానసింకంగా కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకునట్లు తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.