News February 14, 2025
NZB: పొలంలో పడి రైతు మృతి

పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన సొన్ కాంబ్లె రమేశ్(35) గురువారం ఉదయం పొలంలో మందు చల్లడానికి వెళ్లి పడి మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మందు సంచిని తలపై పెట్టుకుని గట్టు పైన నడుస్తూ ఉండగా కాలుజారి ప్రమాదవశాత్తు బురదలో పడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
Similar News
News February 21, 2025
మాక్లూర్: కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించినTPCC చీఫ్

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్ ను TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News February 20, 2025
దళిత బంధు నిధులను విడుదల చేయాలి: MLC కవిత

దళితబంధు నిధులను బడ్జెట్ లోపు విడుదల చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని సవాలు చేశారు.
News February 20, 2025
NZB: పంటల విక్రయాలను పర్యవేక్షించాలి: కలెక్టర్

ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభమైనందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ రైతుల వద్ద నుంచి పంటను సేకరించేలా చూడాలన్నారు.