News February 26, 2025
NZB: పోలింగ్ సామాగ్రి పంపిణీ పరిశీలించిన కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించి నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ పరిశీలించారు.
Similar News
News February 26, 2025
NZB: చికిత్స పొందుతూ మహిళ మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈ నెల 23న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మహిళ మృతి చెందింది. మృతురాలిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రఘుపతి సూచించారు.
News February 26, 2025
పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు..!

కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం(60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 26, 2025
నిజామాబాదు : రంజాన్ మాస సౌకర్యాల ఏర్పాటు:కలెక్టర్

రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కలెక్టర్ తన ఛాంబర్లో మంగళవారం జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.