News February 3, 2025
NZB: ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజమాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను 141 అర్జీల రూపంలో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
Similar News
News February 3, 2025
నవీపేట్: కోడి పందేలు ఆడుతున్న ఆరుగురి అరెస్టు
నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం కొంత మంది కోడి పందేలు ఆడుతుండటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి 2 కోడిపుంజులు, రూ.4650 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నలుగురు నిజామాబాద్, ఒకరు సిరంపల్లి, మరొకరు తీర్మాన్‌పల్లికి చెందిన వారు ఉన్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ వినయ్ వెల్లడించారు.
News February 3, 2025
NZB: సెంట్రల్ జైలును సందర్శించిన DG సౌమ్యా మిశ్రా
నిజామాబాద్ సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ DG సౌమ్యా మిశ్రా సోమవారం వీవింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీల దుస్తులు, తువ్వాళ్లు, న్యాప్కిన్లు, బెడ్షీట్లు మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తున్నారన్నారు. వీటిని వరంగల్ రేంజ్‌లోని అన్ని జైళ్లకు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలకు కూడా విక్రయిస్తామని వెల్లడించారు.
News February 3, 2025
NZB: వ్యభిచార గృహంపై దాడి
నిజామాబాద్ నగరంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి చేసినట్లు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారుతి నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు ముగ్గురు బాధిత మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. 4 సెల్ ఫోన్లు, రూ.3660 నగదును స్వాధీనం చేసుకుని వారిని రూరల్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.