News July 16, 2024
NZB: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో తమకు తెలుసన్నారు.
Similar News
News February 8, 2025
NZB: ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చాలి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన HMలు, MEOల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు.
News February 7, 2025
NZB: కోటగల్లీలో అగ్ని ప్రమాదం, రెండిళ్లు దగ్ధం
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ మార్కండేయ మందిరం సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మధిర ప్రసాద్, సుమలత అనే ఇద్దరికి చెందిన ఇండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ఇండ్లలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.
News February 7, 2025
NZB: ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష
మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. నగరంలో నిన్న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 17 మందిని శుక్రవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు ప్రవేశపెట్టగా అందులో ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు. మిగిలిన 11 మందికి రూ.15,500 జరిమానా విధించారన్నారు.