News January 2, 2025
NZB: బీసీ మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాదులోని ఆమె నివాసంలో బుధవారం బీసీ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. శాతవాహన యూనివర్సిటీ నాయకులు మహేశ్ మాట్లాడుతూ..ఈ నెల 3వ తేదీన సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఇంద్ర పార్క్ వద్ద బీసీ మహా సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీలోని అన్ని కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రమేష్, అన్వేష్, శివ, పవన్, ప్రేమ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 6, 2025
NZB: ఉమ్మడి జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కొంత పెరిగి చలి తీవ్రత కాస్త తగ్గింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా గాంధారి 10.0, జుక్కల్ 10.7, రామలక్ష్మణపల్లి 10.9, డోంగ్లి 11.7, లింగంపేట, వేల్పుగొండ 11.9 నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ సౌత్ 12.9, మెండోరా 13.0, వలిపూర్ 13.2,ఎర్గట్ల 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
News January 6, 2025
కామారెడ్డి: ఓటర్ల లిస్టును ప్రకటించిన జిల్లా కలెక్టర్
రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం తుది ఓటర్ల లిస్ట్ వివరాలు ప్రకటించినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 6,90,317 ఓటర్లు కాగా, 3,33,070 మంది పురుషులు, 3,57,215 మంది స్త్రీలు, 32 మంది ఇతరులని తెలిపారు. నియోజక వర్గాల వారీగా ఓటర్ల వివరాలను సైతం తెలిపారు. అదేవిధంగా 600 మంది సర్వీస్ ఎలక్టర్స్ ఉన్నారన్నారు.
News January 6, 2025
NZB: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతుల స్వీకరించారు. ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.