News February 8, 2025
NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ గొడవ
ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇన్‌స్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
Similar News
News February 8, 2025
వరంగల్: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
News February 8, 2025
పెదపూడి: విద్యుత్ షాక్‌తో టెక్నీషియన్ మృతి
పెదపూడి సినిమా సెంటర్ వద్ద విద్యుత్ షాక్‌తో వాటర్ సర్వీసింగ్ టెక్నీషియన్ మృతి చెందినట్లు పెదపూడి ఎస్ఐ రామారావు శనివారం తెలిపారు. వానపల్లి బుజ్జి అనే టెక్నీషియన్ వాటర్ సర్వీసింగ్ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ గురికావడంతో ప్రమాదం సంభవించినట్లు ఎస్ఐ రామారావు వివరించారు. టెక్నీషియన్ మృతిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News February 8, 2025
HYD: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022 పెన్షన్ కోసం పలువురు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక పేరు మంజూరు కావడం కాప్రా మున్సిపల్ కార్యాలయంలో చర్చనియాంశంగా మారింది.