News February 1, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

image

నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహిపాల్ ఓ ఛానల్‌లో కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి ఎడపల్లి మండలం ఠానాకాలన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News March 6, 2025

కాకినాడ : ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

image

ఏలూరు గ్రామీణ మండలం సోమవరప్పాడు వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి కాకినాడ వస్తున్న బస్సు – లారీని ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఇంటర్ పరీక్షలు

image

విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి పది మంది ఖైదీలు రెగ్యులర్ గాను, మరో ఐదుగురు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీరిలో నలుగురు ఖైదీలు రాజమండ్రి జైలుకు ట్రాన్స్‌ఫర్ కాగా మిగిలినవారు పరీక్షలు రాస్తున్నారు. వీరికి జైలు ప్రాంగణంలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశీలకులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జైలు సూపరిండెండెంట్ మహేశ్ బాబు తెలిపారు.

News March 6, 2025

నిర్మల్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

error: Content is protected !!