News June 29, 2024

NZB: సిమెంట్ పైపే ఆమెకు ఆశ్రయం.!

image

నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన బోర్గాం (కె) మూల మలుపు వద్ద రెండు పాడైన సిమెంట్ పైపులు (గూణలు) ఉన్నాయి. వాటిని ఇల్లుగా మార్చుకొని ఓ వృద్ధురాలు జీవిస్తోంది. భర్త చనిపోయారని, నా అనే వారు ఎవరు లేరని, ఉండటానికి ఇల్లు సైతం లేదని ఆమె పేర్కొంది. దాతలు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Similar News

News September 20, 2024

రైల్వేమంత్రిని కలిసిన NZB ఎంపీ అర్వింద్

image

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను NZB ఎంపీ అర్వింద్ దిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేకి సంబంధించి, పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్వోబీల నిర్మాణం పనులను వేగవంతం చేసేలా అధికారులకు సూచనలను ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

News September 20, 2024

ఆలూరు : వీధికుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు

image

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో శుక్రవారం పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిచ్చికుక్కల దాడిలో ఏడుగురు గాయపడ్డారని చెప్పారు. గాయాలైన వారిని మొదటగా దేగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 20, 2024

కామారెడ్డి: మెగా అదాలత్‌ను వినియోగించుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 28 జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సింధుశర్మ అన్నారు. రాజీపడ దగిన కేసులలో జిల్లాలోని అన్ని కోర్టులో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారించుకోవచ్చని ఆమె సూచించారు.