News August 3, 2024

NZB: ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 5 నుంచి 9 వరకు కొనసాగనున్న ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తాహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జీపీ ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు .

Similar News

News October 8, 2024

వర్గపోరును ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు: ఈరవత్రి అనిల్

image

వర్గపోరును ప్రోత్సహిస్తే ఇక నుంచి ఊరుకునేది ప్రసక్తే లేదని, అందరూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయాలనిTGMDC ఛైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. వేల్పూర్ AMC నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు. పదేళ్లుగా పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు పదవులు వస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు.

News October 7, 2024

KMR: ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలని CMO సీనియర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. KMR కలెక్టరేట్‌లో కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు నిర్వహిస్తున్నామని, ప్రతీ కుటుంబం సమాచారాన్ని సేకరించాలన్నారు. ధాన్యం సేకరణపై ఆయన సమీక్షించారు.

News October 7, 2024

నసురుల్లాబాద్: గుండెపోటుతో యువతి మృతి

image

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన డేగావత్ బీనా (19) గుండెపోటుతో మృతి చెందింది. ఉన్నట్టుండి డెగావత్ బీనాకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. యువతి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గతంలో మృతురాలు బీనా తాత కూడా గుండెపోటుతో మరణించాడు.