News February 1, 2025
NZB:14.5 తులాల బంగారం చోరీ

సిరికొండ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య ఇంట్లో 14.5 తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని సిరికొండ ఏఎస్ఐ బాల్ సింగ్ తెలిపారు. ఏఎస్ఐ వివరాల ప్రకారం.. సత్తయ్య శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాను చూడగా బంగారం పోయిందని బాధితుడు వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Similar News
News March 8, 2025
NZB: భిక్షాటన పేరుతో వచ్చి.. మెడలో గొలుసు చోరీ

భిక్షాటన పేరుతో ఇంట్లోకి చొరబడ్డ ఓ మహిళా ఇంట్లోని వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన నిజామాబాద్ మండలం గుండారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి లక్ష్మి (70) తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఓ మహిళా బిక్షాటన పేరుతొ లక్ష్మి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేక పోవడంతో ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల గొలుసును లాక్కొని పారిపోయింది. బాధితురాలు నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News March 8, 2025
NZB: ఎంపీ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కాంగ్రెస్ నాయకులు

ఎమ్మెల్యే భూపతిరెడ్డిని, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను జిల్లా నాయకుడు ఉమ్మాజీ నరేశ్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూంపల్లి మహేందర్ తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ అభివృద్ధి చెందిందంటే సుదర్శన్ రెడ్డి వాళ్లనే అని పేర్కొన్నారు. భూపతి రెడ్డి ఉద్యమ నాయకుడు అని వారు ఉద్యమం చేసినప్పుడు అరవింద్ రాజకీయాల్లో లేరని గుర్తు చేశారు.
News March 7, 2025
నిజామాబాద్ CPగా సాయి చైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పి. సాయి చైతన్య నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనను నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేసిన సీపీ కల్మేశ్వర్ 5 నెలల క్రితం హైదరాబాద్లో ట్రెయినింగ్ సెంటర్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఇన్ ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.