News December 16, 2024
NZSR: అదృశ్యమైన మహిళ శవమై కనిపించిది
నిజాంసాగర్ PS పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు శవమై కనిపించింది. SI శివకుమార్ వివరాల ప్రకారం.. బంజేపల్లికి చెందిన కుర్మ భూమవ్వ(70)కు కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ క్రమంలో ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబీకులు ఆమె కోసం గాలించారు. ఆదివారం బంజేపల్లి గ్రామ శివారులో శవమై కనిపించినట్లు SI వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News January 25, 2025
ఆర్మూర్: ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.
News January 25, 2025
ఆర్మూర్: డాక్టర్ లక్ష్మణ్‌ను కలిసిన పల్లె గంగారెడ్డి
జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గంగారెడ్డి పసుపు బోర్డు ఛైర్మన్ ఎన్నికకు సహకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పసుపు బోర్డు, పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.
News January 25, 2025
ఆర్మూర్ : ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.