News March 18, 2025

NZSR: హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపికైన వెన్నెల

image

టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం దూప్‌సింగ్ తండాకు చెందిన కొర్ర వెన్నెల ఎంపికయ్యింది. రాజన్న సిరిసిల్లా జోన్ పరిధిలో మహిళా విభాగంలో వెన్నెల 180/300 మార్కులతో మూడో ర్యాంక్ సాధించింది. ఈసందర్భంగా వెన్నెలను తండావాసులు అభినందించారు.

Similar News

News April 18, 2025

మే నుంచి ‘రామాయణ’ పార్ట్-2 షూటింగ్?

image

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమా పార్ట్-1 షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పార్ట్-2 షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్‌లో అశోక వాటిక సీన్లు, రెండు పాటలతో పాటు పలు కీలక సీన్లు చిత్రీకరిస్తారని సమాచారం. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు.

News April 18, 2025

VIJ: తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

image

తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.

News April 18, 2025

ఏఐకేఎస్ జాతీయ కార్యవర్గంలో ముగ్గురికి స్థానం

image

ఏఐకేఎంఎస్ జాతీయ సమితిలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. తమిళనాడులో ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా స్థానం దక్కింది.

error: Content is protected !!