News March 18, 2025
NZSR: హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపికైన వెన్నెల

టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం దూప్‌సింగ్ తండాకు చెందిన కొర్ర వెన్నెల ఎంపికయ్యింది. రాజన్న సిరిసిల్లా జోన్ పరిధిలో మహిళా విభాగంలో వెన్నెల 180/300 మార్కులతో మూడో ర్యాంక్ సాధించింది. ఈసందర్భంగా వెన్నెలను తండావాసులు అభినందించారు.
Similar News
News March 18, 2025
NRPT: కొట్టుకున్న మహిళలు.. ఒకరి మృతి

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా జలాల్ పూర్ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల మేరకు.. గ్రామ నర్సరీ వద్ద లక్ష్మి, మరో మహిళ బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News March 18, 2025
ఆదిలాబాద్: ఎండల నేపథ్యంలో హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు

ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. దింతో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. 7670904306 సెల్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. ప్రజలు ఏమైనా సమాచారం కోసం సంప్రదించాలన్నారు.
News March 18, 2025
పిటిషనర్‌కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.కోటి జరిమానా

TG: హైకోర్టును తప్పు దోవ పట్టించాలని చూసిన ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని దాచి వేరే బెంచ్‌లో ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సీరియస్ అయ్యారు. హైకోర్టును తప్పు దోవ పట్టించేలా పిటిషన్ వేసినందుకు రూ.కోటి జరిమానా విధించారు. దీంతో అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలన్న పిటిషనర్‌కు కోర్టు చెక్ పెట్టింది.