News July 22, 2024

ఇద్దరు MLAల ప్రమాణం చట్టవిరుద్ధం.. చెరో ₹500 ఫైన్: WB రాజ్‌భవన్

image

పశ్చిమబెంగాల్‌లో TMC ఎమ్మెల్యేలు రేయాత్ హుసేన్, సయంతికా బెనర్జీ ప్రమాణస్వీకారంపై గందరగోళం నెలకొంది. వారితో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని రాజ్‌భవన్ పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ వారికి రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలని తెలిపింది. ఈ విషయమై ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆశ్రయించారు. కాగా ఉపఎన్నికల్లో గెలిచిన వీరిద్దరితో ఈ నెల 5న స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు.

Similar News

News December 5, 2025

ప్రపంచ వేదికపై మరోసారి మెరిసిన ఓరుగల్లు అర్జున్

image

ఇజ్రాయిల్‌లో జరిగిన జెరూసలెం మాస్టర్స్ 2025 చెస్ ఫైనల్‌లో ఓరుగల్లు జీఎం ఇరిగేసి అర్జున్ మరో సారి తన ప్రతిభను చాటుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్‌తో ర్యాపిడ్ మ్యాచ్‌లు డ్రాగా ముగియగా, టైబ్రేక్ బ్లిట్జ్‌లో 2.5-1.5 తేడాతో విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. టైటిల్‌తో పాటు 55,000 డాలర్లు అందుకున్న అర్జున్, చిన్ననాటి నుంచే చెస్‌లో ప్రతిభ చూపి 14 ఏళ్లకే జీఎం హోదా సాధించాడు.

News December 5, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇస్రో-<>విక్రమ్<<>> సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. chsshelp@vssc.gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: www.vssc.gov.in

News December 5, 2025

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.