News February 21, 2025
శంభాజీపై అభ్యంతర కంటెంట్: వికిపీడియా ఎడిటర్లపై కేసు?

కనీసం నలుగురు వికిపీడియా ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్ సెల్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై అభ్యంతరకర కంటెంటును తొలగించాలని కోరినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 10+ Emails పంపితే ఆటోమేటిక్ రిప్లై వచ్చింది గానీ కంటెంట్ డిలీట్ చేయలేదు. దీంతో CM దేవేంద్ర ఫడణవీస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ‘ఛావా’ తర్వాత వికీ కంటెంటుపై ఫిర్యాదులు పెరిగాయి.
Similar News
News December 11, 2025
కాకినాడ కలెక్టర్‌కు చిట్టచివరి(26) ర్యాంకు

సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సాగిల్లి షాన్ మోహన్ గత మూడు నెలల్లో(సెప్టెంబర్-డిసెంబర్) 44 ఫైళ్లు స్వీకరించి 42 ఫైళ్లు పరిష్కరించారు. అయితే, ఆయన సగటు ప్రతిస్పందన సమయం అత్యధికంగా 11 రోజులు 16 గంటల 44 నిమిషాలుగా నమోదైంది. ఈయన పనితీరును బట్టి రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానం(26)లో నిలిచారు.
News December 11, 2025
విజయనగరంలో బ్రదర్ అనిల్ సందడి

విజయనగరం పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురజాడ కళా భారతి ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి విశేషంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కార్యక్రమానికి వచ్చి దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, మనుషుల మధ్య ప్రేమ, సేవ, క్షమ, దయ వంటి విలువలను పంచే పవిత్రమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు.
News December 11, 2025
శుభ సమయం (11-12-2025) గురువారం

➤ తిథి: బహుళ సప్తమి సా.6.44 వరకు
➤ నక్షత్రం: ముఖ ఉ.8.31 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6 నుంచి 8 వరకు
➤ రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
➤ యమగండం: ఉ.6 నుంచి 7.30 వరకు
➤ వర్జ్యం: సా.4.31 నుంచి 6.07 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.10-10.48, మ.2.48-3.36 వరకు
➤ అమృత ఘడియలు: ఉ.6.04-7.40 వరకు, పున: రా.2.07-3.44 వరకు


