News August 22, 2024
నిరసనలు: అటు వాళ్లు – ఇటు వీళ్లు

వివిధ అంశాలపై తెలంగాణలో అధికార – విపక్షాలు గురువారం నిరసనలకు దిగనున్నాయి. అదానీ స్టాక్స్ ప్రైస్ మ్యానిప్యులేషన్ ఆరోపణలపై జేపీసీతో విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణలో 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి జరగలేదని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో విపక్ష బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
Similar News
News November 3, 2025
యాక్సిడెంట్ల రికార్డులు లేవన్న TGSRTC.. విమర్శలు

TG: చేవెళ్ల RTC బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలపై OCTలో వివరాలు అడిగిన ఓ RTI కార్యకర్తకు తమ వద్ద అలాంటి రికార్డులు లేవని RTC చెప్పింది. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా రికార్డులు నిర్వహించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే 2017-21 వరకు 2,674 ఘటనల్లో 1,230 మంది మృతి చెందారని 2022లో ఓ దరఖాస్తుకు RTC సమాధానమిచ్చింది. ఇప్పుడు రికార్డులే లేవనడం చర్చనీయాంశంగా మారింది.
News November 3, 2025
₹1500 MO కేసు… 32 ఏళ్ల తర్వాత రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్‌కి 3ఏళ్ల జైలు

మనీ ఆర్డర్ మోసం కేసులో నోయిడా కోర్టు తీర్పు చర్చనీయాంశమైంది. అరుణ్ 1993లో ₹1500 తండ్రికి MO చేశారు. సబ్‌పోస్టుమాస్టర్ మహేంద్ర కుమార్ కమీషన్‌తో కలిపి ₹1575కు నకిలీ రశీదు ఇచ్చి డబ్బును ప్రభుత్వానికి జమ చేయలేదు. సొమ్ము అందకపోవడంతో అరుణ్ ఫిర్యాదు చేయగా అధికారులు కేసుపెట్టారు. తప్పు అంగీకరించిన కుమార్ సొమ్మును తిరిగిచ్చేశాడు. విచారణ అనంతరం కోర్టు రిటైరైన అతడికి 3 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా విధించింది.
News November 3, 2025
పరమాత్ముడి గుణాలను మనం వర్ణించగలమా?

పరమాత్ముడి గుణాలు అనంతం. వాటిని లెక్కించడం అసాధ్యం. ఆయన మనపై కరుణతోనే ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో రామావతారం ఒకటి. ఆ మర్యాద పురుషోత్తముడి గుణాలను ఆదిశేషుడు, మహర్షులు కూడా పూర్తిగా వర్ణించలేరు. అయినా భక్తులు శాస్త్రాలలో ఆయన మహిమలను కీర్తించి, పాటించి, ఇతరులకు తెలిసేలా చేస్తున్నారు. మనం కూడా ఆ దైవ గుణాలను తెలుసుకొని, పాటించాలి. ఆయన లీలలు విని, అనుసరించిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాల వాక్కు.


