News August 13, 2024
ఆగస్టు 15ను బంగ్లాలో సంతాప దినంగా పాటించండి: షేక్ హసీనా

బంగ్లాదేశ్లో ఆగస్టు 15ను జాతీయ సంతాప దినంగా పాటించాలని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఆమె తరఫున కుమారుడు సాజిబ్ వాజెద్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన విధ్వంసం, హింసాత్మక ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జాతిపిత బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని కోరారు. హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 17, 2025
విమర్శలకు భయపడేది లేదు: చంద్రబాబు

AP: మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ల సదస్సులో CM CBN తెలిపారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయన్నారు. 70% మందికి NTR వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థులకు సీట్లూ పెరుగుతాయని చెప్పారు. గతంలో రూ.500Crతో రుషికొండ ప్యాలెస్ను నిర్మించి డబ్బులు వృథా చేశారని, అవి ఉంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవాళ్లమని CM వ్యాఖ్యానించారు.
News December 17, 2025
సేవింగ్స్ లేకపోతే ఇదీ పరిస్థితి

సేవింగ్స్ విలువను గుర్తు చేసే వాస్తవ కథ ఒకటి SMలో వైరల్గా మారింది. 35 ఏళ్ల ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోల్పోయాడు. సదరు కార్పొరేట్ కంపెనీ ఖర్చుల తగ్గింపులో భాగంగా తొలగించేసింది. అయితే అసలు భయం ఏంటంటే అతడి వద్ద ఎటువంటి సేవింగ్స్ లేవు. ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు, అద్దె, EMIలు భారం అయ్యాయి. ప్రస్తుత రోజుల్లో ఏ కంపెనీలోనూ ఉద్యోగ భద్రత ఉండదని, యువత ఆ భ్రమ నుంచి బయటకు రావాలని అతడు సూచించాడు.
News December 17, 2025
విశాఖలో పొగమంచు.. ఉమెన్స్ టీమ్ ఫ్లైట్ డైవర్ట్

దేశంలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. ఉమెన్స్ టీ20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయల్దేరిన ఫ్లైట్ను పూర్ విజిబిలిటీ కారణంగా విజయవాడకు డైవర్ట్ చేశారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్ల కోసం మహిళా జట్టు విశాఖకు వెళ్లాల్సి ఉంది. అటు విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన మరో విమానం కూడా పొగమంచు కారణంగా క్యాన్సిల్ అయింది.


