News June 18, 2024
ఇంగ్లిష్ మీడియంపై మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదు: NCERT చీఫ్

చాలా వరకు స్కూళ్లలో శిక్షణ పొందిన టీచర్లు లేనప్పటికీ తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం పట్ల ఆకర్షితులవుతున్నారని NCERT చీఫ్ సక్లానీ అన్నారు. ‘కంటెంట్ మొత్తాన్ని ఆంగ్లంలో నింపడం వల్ల పిల్లలు వారి మూలాలు, సంస్కృతికి దూరం అవుతారు. వారి విజ్ఞానంపైనా ప్రభావం పడుతుంది. మాతృభాష ఆధారిత బోధన ఉంటేనే మూలాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఇంగ్లిష్ మీడియంపై మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News November 14, 2025
బిహార్: ఓటింగ్ పెరిగితే ఫలితాలు తారుమారు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిన ప్రతిసారీ అధికార పార్టీ కుర్చీ దిగిపోయిందని గత ఫలితాలు చెబుతున్నాయి. 1967లో దాదాపు 7% ఓటింగ్ పెరగగా అధికారంలోని INC కుప్పకూలింది. 1980లోనూ 6.8%, 1990లోనూ 5.7%శాతం పెరగగా అధికార మార్పిడి జరిగింది. ఇక తాజా ఎన్నికల్లోనూ 9.6% ఓటింగ్ పెరిగింది. మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ప్రజలు NDAకే కుర్చీ కట్టబెడతారా అనేది ఈ మధ్యాహ్ననికి క్లారిటీ రానుంది.
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: రేవంత్ ప్రచారం పట్టం కట్టేనా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం CM రేవంత్కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీనికి కారణం ఆయనే స్టార్ క్యాంపెయినర్ కావడం. 2014 నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని రోజుల తరబడి రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మంత్రులు కూడా తోడవటంతో ప్రచారం జోరందుకుంది. అలాగే గత ఎన్నికల్లో నవీన్ ఓటమి కూడా ఈసారి ఓటింగ్పై ప్రభావం చూపిందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
News November 14, 2025
చేతికి కంకణం ఎందుకు కట్టుకోవాలి..?

పూజ తర్వాత చేతికి కంకణం కట్టుకోవడం మన ఆచారం. పూజా ఫలం ఈ కంకణం ఉన్నన్ని రోజులు మనతోనే ఉండి, రక్షగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కంకణం మణికట్టుపై ఉన్న ముఖ్య నరాలపై ఒత్తిడి కలిగించి, జీవనాడి ప్రభావంతో హృదయ స్పందన రేటును సాధారణంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని బంధించి, శరీరాన్ని సమతుల్యంగా ఉంచే ఒక పవిత్ర రక్షా కవచం లాంటిది. దీనిని మగవారు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ధరించాలట.


