News September 28, 2024

OCT 3 నుంచి మావుళ్లమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు

image

భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం ఆయన కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 21, 2026

కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా పారదర్శకతతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

News February 21, 2026

నరసాపురం: గాల్లో ఎగురుతూ కరెంటు పనులు!

image

నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.

News February 21, 2026

భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

image

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.