News October 10, 2025
అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు

1906: రచయిత R.K.నారాయణ్ జననం
1954: బాలీవుడ్ నటి రేఖ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి(ఫొటోలో)జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
Similar News
News October 10, 2025
నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్!

AP: రాష్ట్రంలో నేటి నుంచి NTR వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు నిన్ననే ప్రకటించాయి. రూ.2,700 కోట్లు రావాలని, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. వైద్య సేవలు నిలిపేయొద్దని, సమస్య పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ కోరినప్పటికీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వెనక్కి తగ్గలేదు.
News October 10, 2025
ఎలక్ట్రిక్ పింపుల్ ప్యాచ్

చాలామంది అమ్మాయిల్ని వేధించే సమస్యల్లో మొటిమలు ఒకటి. ఈ సమస్యకు పరిష్కారంగానే మార్కెట్లో పింపుల్ ప్యాచెస్ వచ్చాయి. ఈ ప్యాచ్‌ను మొటిమలపై అతికించుకుంటే చాలు, ఎల్‌ఈడీ స్పాట్ ట్రీట్‌మెంట్ సాయంతో మొటిమలను, వాటి మచ్చలను తగ్గిస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు వారంపాటు పనిచేస్తుంది. ఇవి అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని ఓపెన్ పింపుల్స్‌పై వాడకూడదు. <<-se>>#BeautyTips<<>>
News October 10, 2025
నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు TRP పిలుపు

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో నేడు <<17959012>>తెలంగాణ బంద్<<>>కు పిలుపునిస్తున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) చీఫ్ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బలహీనమైన జీవో నం.9తో సీఎం రేవంత్ బీసీలను మోసం చేశారని, దానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్టేపై సీఎం ఎలా స్పందిస్తారో చూసి రాష్ట్రవ్యాప్త <<17958693>>బంద్‌కు<<>> పిలుపునిస్తామని నిన్న ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.