News October 10, 2024

అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు

image

1906: రచయిత R.K.నారాయణ్ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

Similar News

News December 5, 2025

మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే: వైద్యులు

image

సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో వాడటం వల్ల లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాల్‌ సేవించినప్పుడు & ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మాత్రలు వేసుకోవద్దు. జలుబు/ఫ్లూ ట్యాబ్లెట్లలో కూడా పారాసిటమాల్ ఉంటుంది కాబట్టి రోజువారీ మోతాదును సరిచూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News December 5, 2025

1000 ఇండిగో సర్వీసులు రద్దు.. సారీ చెప్పిన CEO

image

విమానాలు ఆలస్యంగా నడవడం, పలు సర్వీసుల రద్దుతో ఇబ్బందిపడిన వారందరికీ ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. విమాన సేవల్లో అంతరాయాన్ని అంగీకరిస్తున్నామని, 5 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ సమాచారం అందుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని కోరారు. నేడు వెయ్యికిపైగా సర్వీసులు రద్దవగా, సంస్థ తీసుకుంటున్న చర్యలతో రేపు ఆ సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది.

News December 5, 2025

వాస్తు అంటే ఏమిటి? దాని పాత్ర ఏంటి?

image

వాస్తు అనేది ఇంటిని వాస్తవాలకు అనుగుణంగా అమర్చే శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు అంటున్నారు. ‘ప్రతి మనిషికి అత్యవసరమైన సుఖం, సంతోషం, తృప్తి ఒక నివాసంలో లభించాలి. వాస్తు నియమాలు ఈ ఆశయాలను చేరుకోవడానికి సరైన దిశను సూచిస్తాయి. ఇవి ఇల్లు నిర్మాణంలో, సర్దుబాటులో నియమాలను పాటించేలా చేసి, మన జీవితంలో సాఫల్యాన్ని, మంచి ఫలితాలను అందిస్తాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>