News October 11, 2025

అక్టోబర్ 11: చరిత్రలో ఈ రోజు

image

1902: లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జననం
1922: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జననం
1942: సినీ నటుడు అమితాబ్ బచ్చన్ జననం
1947: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ జననం
1993: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య జననం
1997: సినీ, నాటక, రచయిత గబ్బిట వెంకటరావు మరణం
✯ అంతర్జాతీయ బాలికా దినోత్సవం

Similar News

News October 11, 2025

చైనా దిగుమతులపై 100% అదనపు టారిఫ్స్: ట్రంప్

image

చైనా దిగుమతులపై 100% అదనపు టారిఫ్స్ విధిస్తున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పుడున్న టారిఫ్‌లపై అదనంగా 100% విధించారు. అలాగే అన్ని కీలక సాఫ్ట్‌వేర్‌ల ఎగుమతులపైనా ఆంక్షలు విధిస్తామన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో, దానికి ప్రతీకారంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా అసాధారణ దూకుడును ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

News October 11, 2025

నేతన్న భరోసా పథకానికి రూ.48.80 కోట్లు: మంత్రి తుమ్మల

image

TG: నేతన్న భరోసా పథకానికి ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతలకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున రెండు విడతల్లో అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 6,780 మందికి రూ.లక్ష వరకు మాఫీ కానున్నట్లు పేర్కొన్నారు. 65 లక్షల ఇందిరమ్మ చీరలను నవంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని సూచించారు.

News October 11, 2025

10,000+ జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలు: Dy.CM

image

AP: 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు <<17972541>>Dy.CM పవన్<<>> తెలిపారు. రూర్బన్ పంచాయతీలలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రేడ్-1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శులకు వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ MPDO కేడర్‌కు వారిని ప్రమోట్ చేస్తామన్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు.