News October 14, 2025

అక్టోబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

1956: బౌద్ధమతం స్వీకరించిన BR అంబేడ్కర్(ఫొటోలో)
1980: సినీ నటుడు శివ బాలాజీ జననం
1981: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జననం
1982: కవి సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి మరణం
1994: బొగద సొరంగం పనుల ప్రారంభం
1998: అమర్త్యసేన్‌కు నోబెల్ బహుమతి
2010: సినీ రచయిత సాయి శ్రీహర్ష మరణం
2011: తెలుగు రచయిత జాలాది రాజారావు మరణం
*వరల్డ్ స్టాండర్డ్స్ డే

Similar News

News October 14, 2025

ఫిట్‌నెస్, ఫామ్‌ ఉంటేనే WC జట్టులో RO-KO: రవిశాస్త్రి

image

2027 WCలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అది వారి హంగర్, ఫిట్‌నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. AUSతో వన్డే సిరీస్ పూర్తయ్యేలోగా జట్టులో కొనసాగాలో వద్దో వారిద్దరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గిల్, జైస్వాల్, తిలక్ లాంటి యంగ్ ప్లేయర్లు చాలా మంది సత్తా చాటుతున్నారు. కాబట్టి రోహిత్, కోహ్లీ రాణించాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

News October 14, 2025

వెంకటేశ్ మూవీ హిందీ రీమేక్‌లో అక్షయ్

image

వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అందులో తాను హీరోగా నటిస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. హీందీలోనూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

News October 14, 2025

బ్రహ్మపుత్రపై రూ.6.4 లక్షల కోట్లతో ప్రాజెక్ట్

image

బ్రహ్మపుత్ర నదిపై రూ.6.4 లక్షల కోట్లతో హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2047కల్లా 76 గిగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ ప్లాన్‌లో ఈశాన్య రాష్ట్రాల్లోని 12 సబ్ బేసిన్లలో 208 పెద్ద హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి ద్వారా 64.9GW పొటెన్షియల్ కెపాసిటీ, 11.1GW పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ నుంచి జనరేట్ చేయొచ్చని పేర్కొంది.