News October 17, 2024

అక్టోబర్ 17: చరిత్రలో ఈ రోజు

image

1979: మదర్ థెరిసాకు నోబెల్ శాంతి బహుమతి బహూకరణ
1948: నటి అన్నపూర్ణ జననం
1965: పాప్ సింగర్ మాల్గుడి శుభ జననం
1970: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే జననం
1992: హీరోయిన్ కీర్తీ సురేష్ జననం
1992; హీరోయిన్ ప్రణీత సుభాష్ జననం
అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం

Similar News

News January 23, 2026

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత

image

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై విధించిన నిషేధాన్ని హైకోర్టు ఎత్తివేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించే షరతులకు లోబడి తిరిగి ప్రారంభించుకోవచ్చని సూచించింది. యాప్ ఆధారిత ద్విచక్ర వాహన రవాణాను నిషేధిస్తూ 2025 జూన్‌లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఓలా, ఉబెర్ తదితర సంస్థలు HCని ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ సమర్థించింది. తాజాగా డివిజన్ బెంచ్ ఆ తీర్పును పక్కన పెట్టింది.

News January 23, 2026

PCOSలో రకాలు తెలుసా?

image

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే దీంట్లో A, B, C, D అని నాలుగు రకాలుంటాయంటున్నారు నిపుణులు. A రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఏర్పడటం వంటి లక్షణాలుంటాయి.

News January 23, 2026

ICMR-NIIRNCDలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (<>NIIRNCD<<>>)లో 4 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి సా. 5.30 గంటల వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://niirncd.icmr.org.in