News October 18, 2024
అక్టోబర్ 18: చరిత్రలో ఈ రోజు

1931: విద్యుత్ బల్బు ఆవిష్కర్త థామస్ ఆల్వా ఎడిసన్ మరణం
1956: మహిళా టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా జననం
1965: భారత మాజీ క్రికెటర్ నరేంద్ర హిర్వాణి జననం
1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణం
1978: సినీ నటి జ్యోతిక జననం
2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మరణం
2013: రచయిత రావూరి భరద్వాజ మరణం
Similar News
News March 13, 2025
హోలి: కృత్రిమ రంగులు వాడుతున్నారా?

హోలి వేడుకల్లో కృత్రిమ రంగులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రంగులు కళ్లలో పడితే కంటి వాపు, మసకబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇక చర్మంపై పడితే పొడిబారడం, దురదలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తే శ్వాస, జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సహజ రంగులనే వాడాలని సూచిస్తున్నారు.
News March 13, 2025
జూన్ నాటికి అర్హులకు 5 లక్షల ఇళ్లు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
News March 13, 2025
ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నం.1గా ట్రెండ్ అవుతోందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. బ్లాక్‌బస్టర్ సునామీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిందని పేర్కొంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.115 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.