News October 20, 2024

అక్టోబర్ 20: చరిత్రలో ఈరోజు

image

1937: హాస్యనటుడు రాజబాబు జననం
1978: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం
1990: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకర్ రావు మరణం
2008: దర్శకుడు సి.వి. శ్రీధర్ మరణం
2011: నటుడు, గాయకుడు అమరపు సత్యనారాయణ మరణం
➢ప్రపంచ గణాంక దినోత్సవం

Similar News

News November 20, 2025

పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

image

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.

News November 20, 2025

బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్‌లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.

News November 20, 2025

ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

image

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.