News October 21, 2024

అక్టోబర్ 21: చరిత్రలో ఈరోజు

image

1833: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జననం
1902: స్వాతంత్ర్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జననం
1947: ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
1967: క్రీడాకారిణి అశ్వినీ నాచప్ప జననం
1992: హీరోయిన్ శ్రీనిధి శెట్టి జననం
1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
✦పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Similar News

News October 21, 2024

గెలాక్సీలోనే అతిపెద్ద నక్షత్ర సమూహమిది!

image

గెలాక్సీలోని అతి పెద్ద నక్షత్ర సమూహాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ క్లిక్‌మనిపించింది. భూమికి 12వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దీనిని వెస్టర్‌లండ్ 1గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. దీని ద్రవ్యరాశి సూర్యుడి కంటే 50 వేల నుంచి లక్ష రెట్లు ఎక్కువ. ఈ సమూహంలోని కొన్ని నక్షత్రాలు సూర్యుడి పోలిస్తే పెద్దవిగా, 1 మిలియన్ రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తాయి. ఈ క్లస్టర్ వయస్సు 3.5-5 మిలియన్ సంవత్సరాలుంటుంది.

News October 21, 2024

నాడు టాటా నాటిన మొక్క నేడు వృక్షమైంది

image

దివంగత రతన్ టాటా 23 ఏళ్ల క్రితం బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో నాటిన ఓ మొక్క నేడు వృక్షంగా ఎదిగింది. 2001, అక్టోబరు 15న టాటా ఇన్ఫీ ప్రాంగణాన్ని సందర్శించారు. ఆ సమయంలో టబీబుయా రోజియా జాతికి చెందిన మొక్కను అక్కడ నాటారు. నేడు అది పది మందికి నీడనిస్తూ ఆయన జీవితాన్ని గుర్తుచేస్తోంది. ఇటీవలే ఆయన కన్నుమూసిన నేపథ్యంలో ఆ చెట్టు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

News October 21, 2024

కేంద్రం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది: మహేశ్ కుమార్

image

TG: తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలిచ్చామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ ఏమైంది? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకానికి పెట్టిన చరిత్ర BRSది. జీవో 29ను ఫిబ్రవరిలోనే ఇచ్చారు. విపక్షాల ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు?’ అని నిలదీశారు.