News October 24, 2025

అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం

Similar News

News October 24, 2025

ఇవాళ భారత్ బంద్

image

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ను వ్యతిరేకిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీంతో ఇవాళ బంద్ వాతావరణం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నాయి. అటు షాపులు కూడా తెరిచే ఉండనున్నాయి.

News October 24, 2025

నేడు..

image

* ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా 51వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
* దుబాయ్‌లో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. సాయంత్రం 6.30 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల విత్‌డ్రాకు ఈ రోజు మాత్రమే ఛాన్స్.. 81 మంది నామినేషన్లకు అధికారులు ఆమోదం
* WWCలో తలపడనున్న పాకిస్థాన్, శ్రీలంక

News October 24, 2025

ఇంటర్వ్యూతో NIRDPRలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ఎర్త్& ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ జియో ఇన్ఫర్మాటిక్స్/ పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.50వేలు చెల్లిస్తారు. http://career.nirdpr.in