News October 26, 2025

అక్టోబర్ 26: చరిత్రలో ఈరోజు

image

1890: పాత్రికేయుడు, జాతీయోద్యమ కార్యకర్త గణేశ్ శంకర్ విద్యార్థి జననం (ఫొటోలో ఎడమవైపు)
1955: హిందుస్థానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
1965: సింగర్ నాగూర్ బాబు(మనో) జననం (ఫొటోలో కుడివైపు)
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
2005: గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు

Similar News

News October 26, 2025

OTTలోకి ‘కాంతార: ఛాప్టర్-1’ వచ్చేది అప్పుడేనా?

image

‘కాంతార ఛాప్టర్-1’ సినిమా ₹800Cr+ గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ హిందీ, కన్నడ భాషల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమా హిందీ వెర్షన్ మినహా మిగతా దక్షిణాది భాషల్లో ఈ నెలాఖరున OTT( అమెజాన్ ప్రైమ్ వీడియో)లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News October 26, 2025

VH ట్రోఫీలో RO-KO ఆడతారా? గిల్ ఏమన్నారంటే?

image

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత కెప్టెన్ గిల్ తెలిపారు. SAతో ODI సిరీస్ అనంతరం సెలక్టర్లు దీనిపై RO-KOతో చర్చిస్తారని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లందరూ డొమెస్టిక్ టోర్నీల్లో ఆడాల్సిందేనని చీఫ్ సెలక్టర్ అగర్కర్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం రోహిత్, కోహ్లీని VH ట్రోఫీలో ఆడాలని సూచించే అవకాశముంది.

News October 26, 2025

ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు శంభాజీనగర్ స్టేషన్‌గా మార్పు

image

MHలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మార్చినట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మూడేళ్ల క్రితం ఔరంగాబాద్ సిటీ పేరునూ ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చిన సంగతి తెలిసిందే. పేర్ల మార్పును కొందరు సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. పేర్లు మారిస్తే రైళ్లలో అందరికీ సీట్లు దొరుకుతాయా? ప్లాట్‌ఫామ్స్ క్లీన్‌‌గా ఉంటాయా? టికెట్లు వేగంగా బుక్ అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు.