News October 31, 2024
అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు
✒ 1875: సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం. ఆయన జయంతిని కేంద్రం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతోంది.
✒ 1895: భారత క్రికెట్ టీం తొలి కెప్టెన్ సీకే నాయుడు జననం
✒ 1975: సంగీత దర్శకుడు ఎస్డీ బర్మన్ కన్నుమూత
✒ 1984: బాడీగార్డుల చేతిలో ఇందిరాగాంధీ హత్య
✒ 2008: ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చిన కేంద్ర ప్రభుత్వం
✒ 1943: కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ జననం
✒ 2022: పారిశ్రామికవేత్త జేజే ఇరానీ మరణం
Similar News
News October 31, 2024
తిరుమల లడ్డూ ప్రసాదంపై India Today సంచలన అధ్యయనం
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని India Today తన అధ్యయనం ద్వారా తేల్చింది. దేశంలోని వివిధ ప్రముఖ ఆలయాలకు చెందిన ప్రసాదాల్ని సేకరించి పరీక్షలు జరిపించిన సదరు జాతీయ న్యూస్ ఛానల్ వాటి ఫలితాలను తాజాగా బహిర్గతం చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని శ్రీరాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెస్టింగ్ పరీక్షించి జంతువుల కొవ్వు, వెజిటేబుల్ ఫ్యాట్ లేదని నిర్ధారించినట్టు తెలిపింది.
News October 31, 2024
English Learning: Antonyms
✒ Barren× Damp, Fertile
✒ Bawdy× Decent, Moral
✒ Bind× Release
✒ Batty× Sane
✒ Benevolent× Malevolent, Miserly
✒ Befogged× Clear headed, Uncloud
✒ Base× Summit, Noble
✒ Benign× Malignant, Cruel
✒ Busy× Idle, Lazy
News October 31, 2024
అరటి పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తుందా?
అరటిపండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఏడాది పొడవునా లభించే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తింటుంటారు. వీటిని తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుందని కొందరనుకుంటారు. కానీ అరటిని తినడం వల్ల జలుబు, దగ్గు రాదని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే అవి వస్తాయి. అప్పటికే వాటితో బాధపడుతున్నవారు తింటే కఫం పెరుగుతుంది. వీటిలో పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.