News October 4, 2025

అక్టోబర్ 4: చరిత్రలో ఈరోజు

image

1911: సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
1957: మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1977: నటి సంఘవి జననం
1997: క్రికెటర్ రిషభ్ పంత్ జననం(ఫొటోలో)
1947: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత మాక్స్ ప్లాంక్ మరణం
2015: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరణం
* అంతర్జాతీయ జంతు దినోత్సవం

Similar News

News October 4, 2025

సకల సంపదలు ఉన్నా.. భక్తి లేకపోతే శూన్యమే!

image

భగవద్భక్తి హీనస్య జాత్యాశ్శాస్త్రంజపస్తప:॥
అప్రాణస్యైవ దేహస్య మండనంలోకరంజనమ్॥
అని ‘భక్తి వేదం’ తెలుపుతోంది. అంటే.. దేవునిపై భక్తి లేకపోతే, మనిషి ఎన్ని గొప్ప పనులు చేసినా అది వ్యర్థమే. ఎంత ధనం ఉన్నా, విద్యావంతులైనా, గొప్ప వంశంలో పుట్టినా.. దైవభక్తి లేకపోతే అవన్నీ ప్రాణం లేని దేహానికి అలంకరణ చేసినంత వ్యర్థం అనేది ఈ శ్లోక తాత్పర్యం. దేనిలోనైనా భగవద్భక్తి ఉండడమే ముఖ్యమని ఈ శ్లోకం చెబుతోంది. <<-se>>#daivam<<>>

News October 4, 2025

ఇండియా-Aకు ఘోర పరాజయం

image

ఆస్ట్రేలియా-Aతో రెండో వన్డేలో ఇండియా-A ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన IND-A 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. తిలక్(94), పరాగ్(58) రాణించారు. ఆసియాకప్ హీరో <<17908264>>అభిషేక్<<>>(0) విఫలమయ్యారు. వర్షం కారణంగా DLS పద్ధతిలో టార్గెట్‌ను 25 ఓవర్లలో 160కి కుదించారు. ఈ లక్ష్యాన్ని AUS-A కేవలం 16.4 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. సిరీస్‌ 1-1తో సమం కాగా చివరిదైన మూడో మ్యాచ్ రేపు జరగనుంది.

News October 4, 2025

యంగ్ ఇండియా స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం

image

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 2026-27కి గాను 1-6 తరగతుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల తల్లిదండ్రులు <>https://yipschool.in/<<>>లో లేదా 9059196161 నంబర్‌ను సంప్రదించాలని DGP కార్యాలయం వెల్లడించింది. 50% సీట్లు పోలీస్ సిబ్బందికి, మిగతా 50% సీట్లు సాధారణ ప్రజల పిల్లలకు కేటాయించింది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా అకడమిక్, స్పోర్ట్స్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయని తెలిపింది.