News October 6, 2024
అక్టోబర్ 6: చరిత్రలో ఈరోజు

1892: ఆంగ్ల కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ మరణం
1932: భారత భౌతిక శాస్త్రవేత్త గణేశన్ వెంకటరామన్ జననం
1946: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా జననం
1963: హైదరాబాద్‌లో నెహ్రూ జూపార్క్ ప్రారంభం
1967: తెలుగు సినీ దర్శకుడు సి.పుల్లయ్య మరణం
Similar News
News January 8, 2026
అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్‌లో ముగ్గురు ఇండియన్లు!

రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్‌ను అమెరికా నిన్న <<18791945>>స్వాధీనం<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అందులోని 28 మంది సిబ్బందిలో ముగ్గురు ఇండియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. 17మంది ఉక్రేనియన్లు, ఆరుగురు జార్జియా పౌరులు, ఇద్దరు రష్యన్లు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ US నిర్బంధించింది. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని, విదేశీయులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని రష్యా డిమాండ్ చేసింది.
News January 8, 2026
10pmకు రాజాసాబ్ ప్రీమియర్ షో.. అయితే!

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్‌పై ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. రాత్రి 10 గంటలకు బాలానగర్ విమల్ థియేటర్‌లో షో వేయనున్నారు. దీనికి కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నారు. అటు ఏపీలో మాత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతున్నాయి.
News January 8, 2026
ACB కేసుల్లో దర్యాప్తు జరగాల్సిందే: సుప్రీంకోర్టు

AP: ACB నమోదు చేసిన FIRలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ACB సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(CIU)-విజయవాడ ఫైల్ చేసిన అన్ని FIRలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 6నెలల్లో తుది నివేదిక ఇవ్వాలని, ప్రతివాదులను అరెస్ట్ చేయొద్దని సూచించింది. ACB CIUకు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదనే కారణంతో FIRలను హైకోర్టు గతంలో కొట్టేసింది. దీన్ని SCలో ACB సవాలు చేసింది.


