News October 7, 2025

అక్టోబర్ 7: చరిత్రలో ఈరోజు

image

1708: సిక్కుల చివరి గురువు గురు గోవింద సింగ్ మరణం
1885: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జననం
1940: కవి, రచయిత కూచి నరసింహం మరణం
1977: మిస్ వరల్డ్ (1999), నటి యుక్తా ముఖీ జననం
1978: భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ జననం (ఫొటోలో)
☞ ప్రపంచ పత్తి దినోత్సవం

Similar News

News March 30, 2026

సల్మాన్- వంశీ పైడిపల్లి సినిమా.. ఏప్రిల్ నుంచి షూటింగ్!

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమా కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడిస్తూ సల్మాన్, వంశీ ఉన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా సల్మాన్ సరసన నటి నయనతార కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ కాంబో ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News March 30, 2026

జనగణన.. సహజీవన జంటలకు కుటుంబ హోదా

image

దేశంలో ఎల్లుండి నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా గుర్తిస్తామని పేర్కొంది. అందుకు ఎటువంటి ఆధారాలు అవసరం లేదని, కాకపోతే ఆ జంట అనుమతి తప్పనిసరని వెల్లడించింది. గతంలో పెళ్లికాని జంటలు తమను తాము వివాహితులుగా నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 33 ప్రశ్నలతో జనగణన సాగనుంది.

News March 30, 2026

ఏప్రిల్ 4వ వారంలో టెన్త్ ఫలితాలు

image

AP: టెన్త్ పరీక్ష ఫలితాలు APR 4వ వారంలో విడుదల చేసేందుకు SSC బోర్డు చర్యలు చేపట్టింది. APR2తో పరీక్షలు ముగుస్తాయి. జవాబు పత్రాల మూల్యాంకనం 6-15 తేదీ వరకు జరుగుతుంది. అనంతరం OMR స్కానింగ్ ఉంటుంది. ఆన్సర్ షీట్లలో తేడాలుంటే వెరిఫికేషన్‌కు జిల్లాలను సంప్రదించడం, వాల్యుయేషన్ పత్రాల ర్యాండమ్ చెకప్ అనంతరం కంప్యూటరీకరణ చేస్తుంది. ఇవి పూర్తయ్యాక 30లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.