News March 17, 2024

ఓదెల: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ఓదెలకు చెందిన వెంకటసాయి(28) బీటెక్ పూర్తి చేసుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా తన సోదరుడు, సోదరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. తనకు తక్కువ వేతనం ఉండి, చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని కొద్ది రోజులుగా మనస్తాపానికి గురవుతున్నాడు. దీంతో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పొత్కపల్లి పోలీసులు తెలిపారు.

Similar News

News April 5, 2025

కరీంనగర్ వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను కరీంనగర్ జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

News April 5, 2025

గ్రూప్-1లో మెరిసిన గంగాధర ఎస్ఐ

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వంశీ కృష్ణ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో 390వ ర్యాంక్ సాధించాడు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్-1 పరీక్ష రాయగా మెరుగైన ర్యాంక్ సాధించాడు. దీంతో ఆయనకు మండల ప్రజలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

News April 5, 2025

కరీంనగర్ స్మార్ట్ సిటీ పెండింగ్ పనులపై సమీక్ష

image

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆర్వీ కన్సల్టెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ లిమిటెడ్‌లో అభివృద్ధి పనులపై చర్చించి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.

error: Content is protected !!