News March 18, 2024
ఓదెల: గుండెపోటుతో యువకుడు మృతి

వివాహ వేడుకలో డాన్స్ చేస్తుండగా వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొని డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్(33)గా గుర్తించారు.
Similar News
News March 4, 2026
KNR: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో హోలీ సంబరాలు

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హోలీ పండుగ సందర్భంగా మహిళా విద్యార్థులతో సహజ రంగులతో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ హిత దృక్పథంతో, ఆరోగ్య రక్షణను ప్రధానంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ వేడుకలో రసాయనిక రంగులను పూర్తిగా నివారించి సహజ పూలు, ఔషధ గుణాలున్న వనరులతో రంగులను తయారు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News March 4, 2026
కరీంనగర్ జిల్లా కోర్టులో ఘనంగా హోలీ వేడుకలు

కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. పరస్పర స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు చిన్నారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కోర్టు ప్రాంగణం రంగులతో కళకళలాడింది.
News March 3, 2026
ముఖ్యమంత్రి సదస్సులో కరీంనగర్ కలెక్టర్

హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ప్రధానంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.


