News January 10, 2025
వన్డే సిరీస్.. రాహుల్కు రెస్ట్?

ఇంగ్లండ్తో వచ్చే నెల నుంచి స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్కు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమవనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ నుంచి తనకు రెస్ట్ ఇవ్వాలని కోరినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. BGT ఆడిన రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం అయ్యేందుకు తనను వన్డే సిరీస్కు పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పినట్లు వెల్లడించారు. అయితే CTలో శాంసన్, పంత్ నుంచి రాహుల్కు గట్టి పోటీ ఎదురవుతోంది.
Similar News
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<
News December 3, 2025
‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్నకు 1.4 కోట్లకుపైగా డౌన్లోడ్లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.
News December 3, 2025
ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.


