News September 11, 2024
ODI వరల్డ్ కప్ వల్ల భారత్కు రూ.11,637 కోట్ల బిజినెస్: ICC

వన్డే ప్రపంచ కప్ వల్ల భారత్కు లాభమే జరిగిందని ICC పేర్కొంది. గతేడాది OCT 5 నుంచి NOV 19 వరకు 10 నగరాల్లో ICC మ్యాచ్లు నిర్వహించింది. దీని ద్వారా 1.39 బిలియన్ డాలర్ల (రూ.11,637 కోట్లు) బిజినెస్ జరిగిందని ICC ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచులు చూసేందుకు వచ్చిన ఇంటర్నేషనల్ టూరిస్టుల వసతి, ఆహారం, రవాణా వంటివి అత్యధిక బిజినెస్ను అందించాయి. దీంతోపాటు రాష్ట్రాల్లోని స్టేడియాలు అప్గ్రేడ్ అయ్యాయి.
Similar News
News December 2, 2025
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<
News December 2, 2025
NDAలోకి విజయ్ దళపతి?

తమిళనాడులో NDA కూటమిలోకి TVK చీఫ్ విజయ్ చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉండొచ్చని అన్నాడీఎంకే చీఫ్ <<17963359>>పళనిస్వామి <<>>గతంలో సంకేతాలిచ్చారు. అయితే కూటమిలో చేరుతున్నామనే వార్తలను TVK ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే కూటమిగా వెళ్తేనే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.
News December 2, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* సచివాలయంలో విద్యుత్, మైనింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
* కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
* హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని విచారించిన అధికారులు.. షాగౌస్, పిస్తా హౌస్, మెహిఫిల్ హోటళ్లతో సంబంధాలపై ఆరా
* కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్


