News March 26, 2024
కంగనాపై అభ్యంతరకర పోస్ట్.. మహిళా కమిషన్ సీరియస్

బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ నటి కంగనా రనౌత్‌పై సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర <<12924073>>పోస్ట్<<>>పై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇందుకు కారణమయిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వేరెవరో ఆ పోస్ట్ పెట్టారని.. దాన్ని తాను తొలగించినట్లు సుప్రియా తెలిపారు.
Similar News
News January 31, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు.. తీవ్రంగా ఖండించిన భారత్

అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో PM మోదీ పేరు ఉండటాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. 2017లో ఇజ్రాయెల్ పర్యటనకు మోదీ వెళ్లారన్న విషయం తప్ప మిగతావన్నీ అబద్ధాలేనని కొట్టిపారేసింది. దోషిగా తేలిన నేరస్థుడి చెత్త పుకార్లని MEA ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మండిపడ్డారు. మోదీ తన సలహా తీసుకున్నారని ఎప్‌స్టీన్ చెప్పినట్లు ఆ డాక్యుమెంట్లలో ఉంది. పలు వివాదాస్పద అంశాలనూ ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
News January 31, 2026
మున్సిపల్ ఎన్నికలు.. CM షెడ్యూల్ ఫిక్స్

TG: సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న రంగారెడ్డి జిల్లా పరిగి, 8న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి, 9న మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.
News January 31, 2026
ఫ్యూచర్ ట్రేడింగ్.. వెండి రేటు రూ.1.28 లక్షలు డౌన్

కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. <<19006060>>ఫ్యూచర్ ట్రేడింగ్<<>>(మార్చి)లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1,28,126 పడిపోయి రూ.2,91,922 పలికింది. అలాగే ఏప్రిల్‌కు సంబంధించి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,50,849కి పడిపోయింది. లైఫ్ టైమ్ హై(రూ.1,80,779)తో పోల్చితే రూ.29,930 తగ్గడం గమనార్హం.


