News May 10, 2024
ఆఫర్.. ఓటేస్తే హెయిర్ కట్ ఫ్రీ
AP: ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు పలువురు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన RK సెలూన్ ఓనర్ రాధాకృష్ణ ఓటు వేసిన వారికి ఫ్రీగా హెయిర్ కట్ చేయనున్నట్లు తెలిపారు. ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికే ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఓటు వేసిన తర్వాత ముత్యాలమ్మ ఆలయం, కంచరపాలెం మెట్టుకు ఎదురుగా ఉన్న తమ సెలూన్ షాప్‌కు వస్తే ఫ్రీగా హెయిర్ కట్ చేస్తామన్నారు.
Similar News
News December 25, 2024
తిరుమల పరకామణిలో కుంభకోణం?
AP: తిరుమల పరకామణిలో గతంలో రూ.కోట్లలో స్కామ్ జరిగిందని TTD ఛైర్మన్ BR నాయుడికి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విదేశీ కరెన్సీ లెక్కింపులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 2023లో పరకామణిలో చోరీపై పెద్ద జీయంగార్ మఠం ఉద్యోగిపై కేసు నమోదైందని, ఆ కేసు తిరిగి విచారించాలన్నారు. నాడు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్‌లో రాజీ పడ్డామన్న విజిలెన్స్ అధికారుల నివేదికను ఆయన తప్పుబట్టారు.
News December 25, 2024
విచిత్రం: మగ టీచర్‌కు ప్రసూతి సెలవు మంజూరు
బిహార్ విద్యాశాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా విచిత్రంగా ఆయనకు మంజూరయ్యాయి. దీంతో ఆయన 8 రోజులపాటు మెటర్నిటీ లీవ్‌లను ఎంజాయ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామన్నారు.
News December 25, 2024
క్రీడా అవార్డుల్లో కేంద్రం వివక్ష: హర్వీందర్ సింగ్
ఖేల్‌రత్న అవార్డులకు నామినేట్ చేసే విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న <<14970210>>మనూ భాకర్ తండ్రి విమర్శల<<>> నడుమ పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ విజేత హర్వీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అవార్డుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో విజేతలకు ఖేల్ రత్న ఇచ్చారు. పారిస్ పారాలింపిక్స్‌లో విజేతలకు ఎందుకు ఇవ్వట్లేదు? ’ అని Xలో ప్రశ్నించారు.