News July 12, 2024
రష్యాలో ఆఫర్.. బిడ్డను కంటే రూ.92వేలు!

సంతానోత్పత్తిని పెంచడానికి రష్యాలోని కరేలియా అధికారులు ఆఫర్ ప్రకటించారు. 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే రూ.92 వేలు బహుమతిగా ఇస్తామన్నారు. ఈ స్కీమ్ 2025, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఆ దేశంలో కండోమ్లు, గర్భ నిరోధక మాత్రలపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు మాస్కో టైమ్స్ పేర్కొంది. కాగా దేశంలోని ప్రతి మహిళ 8 మందికి జన్మనివ్వాలని గత ఏడాది పుతిన్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


