News September 18, 2024

OFFER: ఆ రోజున రూ.99కే సినిమా టికెట్

image

మూవీ లవర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20న రూ.99కే మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్ వర్తిస్తుంది. PVR ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీ టైమ్, డిలైట్ మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ కేటగిరీలకు వర్తించదు.

Similar News

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో రేపు యథావిధిగా స్కూల్స్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మంగళవారం యథావిధిగా స్కూల్స్ కొనసాగనున్నాయి. ‘దిత్వా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో సోమవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 2న మోస్తరు వర్షాలు కురవనుండడంతో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించాలని DEO ఆదేశాలు జారీ చేశారు.

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

image

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.