News October 20, 2024
ఆఫీసు గొడవలుండేవే.. ఇవాళైనా ఫ్యామిలీతో గడపండి!

వారానికి ఎండ్ చెప్పేందుకు వీకెండ్ వచ్చేసింది. ఆరు రోజులుగా శ్రమించిన మీ మెదడు, శరీరానికి కాస్త రిలీఫ్ ఇవ్వండి. ఇవాళ ఎలాంటి శ్రమ తీసుకోకండి. ఎలాంటి ఆలోచనలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా గడపండి. టైంపాస్ కోసం మార్నింగ్ వాక్ చేయండి. ఇళ్లు, కార్, బైక్ శుభ్రం చేసుకోండి. ఇది ఒక వ్యాయామంలా అవుతుంది. భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో సరదాగా గడపండి. ఆఫీసు విషయాలు, మొబైల్ను పక్కన పెట్టి ఫ్యామిలీతో ముచ్చటించండి.
Similar News
News October 18, 2025
మరో వివాదంలో యూసుఫ్ పఠాన్

Ex క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బెంగాల్లోని అదీనా మసీదుపై ఆయన చేసిన ట్వీట్ తాజాగా దుమారం రేపింది. ఇది అద్భుత కట్టడమని, సుల్తాన్ సికందర్ నిర్మించారని పోస్ట్ చేయడంపై BJP నేతలు మండిపడుతున్నారు. అది మసీదు కాదని, ఆదినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారని కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల <<17728883>>ప్రభుత్వ స్థలాన్ని<<>> ఆక్రమించారని ఆయనపై GJ హైకోర్టు సీరియస్ అవడం తెలిసిందే.
News October 18, 2025
ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ.. దీపావళి కానుక ప్రకటిస్తారా?

AP: మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా సీఎం వారితో చర్చిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం ఏదైనా కానుక అందిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. దీనిపై కాసేపట్లో సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.
News October 18, 2025
కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు

TG: జిల్లా–కోఆపరేటివ్ బ్యాంకుల్లో(DCCB) స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. వయసు 18-30 ఏళ్లు. డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ వివరాలకు <