News May 21, 2024

చట్టాన్ని అతిక్రమించిన అధికారులు జైలుకే: బొండా ఉమా

image

AP: సీఎం జగన్‌ను నమ్మి చట్టాన్ని అతిక్రమించిన అధికారులు జైలుకు వెళ్లక తప్పదని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘వైసీపీ నేతల ఇళ్లలో మారణాయుధాలు దొరికినా ఎలాంటి కేసులు లేవు. అరాచకం సృష్టించిన నేతలను అరెస్ట్ చేయాలి. సిట్ నివేదికను డీజీపీ బయటపెట్టాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

గంభీర్ వల్లే ఓడిపోయాం.. నెటిజన్ల ఫైర్

image

నిన్న సౌతాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పులే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే ఎందుకు మార్పులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్పెషలిస్టు బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఆడించకుండా నలుగురు స్పిన్నర్లు ఎందుకని నిలదీస్తున్నారు. గతేడాది NZతో వైట్‌వాష్ అయినా పాఠాలు నేర్వకుండా మళ్లీ స్పిన్ పిచ్‌లే ఎందుకు తయారుచేశారని ప్రశ్నిస్తున్నారు.

News November 17, 2025

ఒకేసారి రెండు సీక్వెల్స్‌లో తేజా సజ్జ!

image

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్‌లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్‌ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్‌పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.

News November 17, 2025

ఏపీలో అణువిద్యుత్ ప్రాజెక్ట్.. పరిశీలిస్తున్న NTPC!

image

విద్యుదుత్పత్తి సంస్థ NTPC 700, 1000, 1,600 మెగావాట్ల కెపాసిటీతో అణువిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం AP, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. 2047 నాటికి 30K మె.వా. విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వెయ్యి మెగావాట్ల ప్లాంట్‌కు రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.