News December 29, 2025

OFFICIAL: తిరుపతిలో R.కోడూరు.. గూడూరు ఔట్.!

image

తిరుపతిలో జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గ విలీనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ కొత్త మార్పులు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.

Similar News

News December 29, 2025

MHBD: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న 86 దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాలకు పంపి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News December 29, 2025

గద్వాల: గ్రీవెన్స్ డేకు 20 ఫిర్యాదులు- ఎస్పీ శ్రీనివాసరావు

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కు 20 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భూ వివాదాలకు సంబంధించి 10, గొడవలకు సంబంధించి 2, భార్యాభర్తల తగాదా 1, ఇతర అంశాలకు సంబంధించి 7 మొత్తం 20 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.

News December 29, 2025

రాయచోటి ప్రజలకు క్షమాపణలు: మంత్రి రాంప్రసాద్

image

AP: రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంతో <<18702293>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై తొలిసారి స్పందించారు. స్థానిక ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాయచోటి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టబోనని స్పష్టం చేశారు. ప్రజలు ఏడాదిలో ఈ బాధ నుంచి బయటపడేలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడనని, విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇస్తానన్నారు.