News December 23, 2025
OFFICIAL: వారణాసిలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్

మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చిత్రంలో విలక్షణ నటుడు <<18570987>>ప్రకాశ్ రాజ్<<>> నటిస్తున్నారంటూ గాసిప్స్ వైరలైన విషయం తెలిసిందే. తాను వారణాసి చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పుడు స్వయంగా ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ‘వారణాసి షూటింగ్‌లో అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. రాజమౌళి, మహేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాకు థాంక్స్. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 11, 2026
మున్సి‘పోల్’కు వేళాయే!

TG: మున్సిపోల్‌కు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉ.7 గంటల నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ఓటర్/ఆధార్/పాన్/డ్రైవింగ్ వంటి గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
News February 11, 2026
జగమంతా శివతత్వం

శివతత్వం అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు. అది అంతటా నిండి ఉన్న అనంతమైన చైతన్యం. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రకృతిలోని ప్రతి మార్పులోనూ శివుడు ఉన్నాడు. కనిపించే పర్వతాలు, ఆకాశం నుంచి మనలో కలిగే ఆలోచనలు, కలల వరకు అన్నీ ఆ శివమయమే. శివం కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. మన ఊహకు అందేదీ ఆయనే! ఆ ఊహ చేసేదీ ఆయనే! శివతత్వం అంటే మౌనం, శూన్యం, సమస్తం. జగమంతా శివతత్వమే.
News February 11, 2026
విశాఖలో IPL మ్యాచులు?

IPL–2026లో విశాఖ వేదిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ACA–VDCA స్టేడియంలో కనీసం రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక DCకి కలిసి రాగా ఈ ఏడాది కూడా మ్యాచుల నిర్వహణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ సంఘం DCని సంప్రదించగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.


